![]() |
![]() |
.webp)
అగ్నిపరీక్ష ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ట్విస్ట్ లతో సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ మొదట్లోనే రామకృష్ణ, గాయత్రి, శ్రష్టి, రోహిత్ నలుగురికి ఎల్లో కార్డ్ లు ఉన్నాయని వాళ్లలో ఎవరు ఫేక్, ఎవరు రియల్ అని మిగిలిన కంటెస్టెంట్లు చెప్పాలని టాస్క్ ఇచ్చారు. ఒక్కొక్కరు తమ పాయింట్ చెప్తున్న టైంలోనే గొడవ స్టార్ట్ అయింది. రామకృష్ణ తన వెర్షన్ వినిపిస్తుండగా మధ్యలో షాలిని ఒక్కసారిగా ఎగిరిపడింది. అతను చెప్పేది వినకుండా గట్టిగట్టిగా అరుస్తూ మీద మీదకు వెళ్లి అడ్డుపడింది. రామకృష్ణ మాట్లాడకుండా చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
షాలిని ప్రవర్తన చూసి జ్యూరీ బిందు మాధవి వెంటనే మధ్యలో కలుగజేసుకుంది. నువ్వు చేస్తున్నది తప్పు, నీకు పాయింట్ ఉంటే చెప్పు, అంతే కానీ అలా మీదకు వెళ్లి అరవకు అని బిందుమాధవి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. బిందు మాధవి వార్నింగ్ తో హౌస్ మొత్తం సైలెంట్ అయిపోయింది.
బిందు మాధవి మాటల తర్వాత షాలినీ తన తప్పు తెలుసుకుంది. తను మాట్లాడిన మాటల్లో తప్పు లేదు కానీ, మాట్లాడిన తీరు తప్పు అని ఒప్పుకుంది. అందరి ముందు రామకృష్ణకి మిగిలిన కంటెస్టెంట్లకి సారీ చెప్పింది. ఈ గొడవ తర్వాతే షాలినీ పేరు వీక్ కంటెస్టెంట్ల లిస్ట్ లోకి వచ్చింది. ఫైనల్ జడ్జిమెంట్ లో లీడర్లు చెప్పిన ముగ్గురు వీక్ ప్లేయర్లలో షాలినీ పేరు కూడా ఉండటానికి ఈ ఓవర్ రియాక్షనే కారణమని అందరు అనుకుంటున్నారు.
![]() |
![]() |